“అల” పారిస్ షెడ్యూల్ పూర్తయింది

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా నుంచి సామజవరగమన అనే సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. టోటల్ సౌత్ లోనే నంబర్ వన్ హిట్ గా నిలిచింది ఈ పాట.

ఇలాంటి హిట్ సాంగ్ ను పారిస్ లో చిత్రీకరించారు యూనిట్. నిన్నటితో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. రేపు యూనిట్ అంతా హైదరాబాద్ రిటర్న్ అవుతుంది. పాట చాలా బాగా వచ్చిందంటున్నాడు శేఖర్ మాస్టర్.

ఇక సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ఈనెల 17 నుంచి రామోజీ ఫిలింసిటీలో మొదలవుతుంది. దీనికోసం ఇప్పటికే ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కూడా ఓ పాటను షూట్ చేయబోతున్నారు. మరోవైపు టబు పాత్ర కోసం వేసిన భారీ ఇంటి సెట్ అలానే ఉంది. అక్కడ కూడా కొంత ప్యాచ్ వర్క్ షూట్ చేయబోతున్నారు.

అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 14వ తేదీన రాబోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలకానున్న అల వైకుంఠపురములో సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు.