వీకెండ్ రిలీజ్

ఈ వీకెండ్ ఏకంగా 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో 2 స్ట్రయిస్ మూవీస్ కాగా, మిగతా 2 డబ్బింగ్ మూవీస్. వీటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమా తెనాలి రామకృష్ణ. దీనిపై అంచనాలు పెరగడానికి కారణం సందీప్ కిషన్ కాదు, ఆ సినిమా ట్రయిలర్. తెనాలి రామకృష్ణ ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో అంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కామెడీ క్లిక్ అయితే సినిమా హిట్ అయినట్టే. నాగేశ్వర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో హన్సిక రీఎంట్రీ ఇస్తోంది.

తెనాలితో పాటు వస్తున్న మరో స్ట్రయిట్ మూవీ రాగల 24 గంటల్లో. ఈషా రెబ్బా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సత్య హీరోగా నటించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రఘుకుంచె సంగీత దర్శకత్వం వహించాడు. కొంతమంది స్టార్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రయిలర్ రిలీజ్ చేయడం ప్రమోషన్ కు పనికొచ్చింది.

ఈ రెండు సినిమాలతో పాటు యాక్షన్, విజయ్ సేతుపతి అనే మరో 2 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఎప్పట్లానే తన కొత్త సినిమా యాక్షన్ ను తెలుగులోకి కూడా డబ్ చేసి వదుల్తున్నాడు హీరో విశాల్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఫుల్ యాక్షన్ తో ఉంటుంది. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు.

అటు విజయ్ సేతుపతికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, అతడు నటించిన ఓ తమిళ సినిమాను అతడి పేరుమీదే విడుదల చేస్తున్నారు. రాశిఖన్నా ఇందులో హీరోయిన్.