దిగ్గజ దర్శకుడు ఇలా మారిపోయాడు…

మణిరత్నం…. దక్షిణాదిలో ఉన్న గొప్ప దర్శకుల్లో ఒకరు. అప్పట్లో ఆయన తీసిన ‘నాయకన్’, దళపతి, సఖి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలు ఇప్పటికీ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి గొప్ప దర్శకుడు ఇప్పుడు హిట్టు కోసం చకోర పక్షిలా ఇండస్ట్రీలో తిరుగుతున్నాడు. ఇప్పటికే ఆయన తీసిన ‘కాదల్’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక తన రూటు మార్చాడు.

ఇటీవలే తీసిన ‘ఓకే బంగారం’ మూవీ హిట్ అయ్యి మణిరత్నంను మళ్లీ ఇండస్ట్రీలో నిలిపింది. అయితే తాజాగా తన రూటు మార్చుకోవడంపై మణిరత్నం స్పందించారు.

అప్పటికీ ఇప్పటికీ సినిమాల్లో చాలా తేడా వచ్చిందని మణిరత్నం చెప్పుకొచ్చాడు. ఒక చిన్న స్టోరీ లైన్ పై ఆధారపడి ఇప్పుడు సినిమాలు ఉన్నాయని తెలిపాడు. ఇప్పుడు సినిమాకు స్క్రిప్ట్ అవసరం లేదని.. కేవలం ప్రెజంటేషన్ మాత్రమే సినిమాను హిట్ బాట పట్టిస్తుందని మణిరత్నం తెలిపాడు.

ఇక కేవలం 3 నిమిషాల్లోనే కథను చెప్పగలిగేలా ఉంటేనే సినిమాను వెండితెరపై చూపించవచ్చని నిర్మాత వైరముత్తు తెలిపారు. ఆ ఫార్ములాను మణిరత్నం వంట బట్టించుకున్నాడని వైరముత్తు తెలిపారు.

ఇలా హిట్ బాట పట్టడం కోసం దిగ్గజ దర్శకుడు మణిరత్నం చాలా మారిపోయాడని ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.