అప్పట్లో రోజా… ఆఫ్టర్ లాంగ్ గ్యాప్… రాజేంద్రప్రసాద్‌కు రంపం కోత

”అరే కర్రి నా కొడకా… ఒంటి కన్నునా కొడకా… డొక్క పగిలిద్ది నా కొడకా, చెత్త నా కొడక, నీయబ్బ రోడ్డు మీద కనపడు చెప్పు తెగుద్ది నాకొడక… ” ఇవీ తరచు టీవీ చానళ్లలో ఉత్సాహంగా పాల్గొని కంటెంట్‌ తక్కువగా ఉన్నా సరే తన హావభావాలతోనే ప్రత్యర్థులకు చికాకు తెప్పించే చాతుర్యం ప్రదర్శించే టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు ఎదురైన తిండ్ల దండకం.

చర్చకు వచ్చిన ప్రత్యర్థి పార్టీని చులకన వ్యాఖ్యలతో ఇరిటేట్ చేయడంలో సిద్ధహస్తుడైన రాజేంద్రప్రసాద్ ను రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే రోజా లైవ్ డిబేట్‌లోనే చెప్పుతో కొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా అదే చానల్ చర్చా కార్యక్రమంలో బాబు రాజేంద్ర ప్రసాద్‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి ఊహించని తిట్ల సన్మానం ఎదురైంది. ”అరే కర్రి నా కొడకా… ఒంటి కన్నునా కొడకా… డొక్క పగిలిద్ది నా కొడకా, చెత్త నా కొడక, నీయబ్బ రోడ్డు మీద కనపడు చెప్పు తెగుద్ది నాకొడక… ‘ అని వంశీ ఏకధాటిగా తిడుతుంటే ఏం చేయాలో తెలియక బాబు రాజేంద్రప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆలస్యంగానైనా యాంకర్ జోక్యం చేసుకోవడంతో రాజేంద్రప్రసాద్‌కు కాస్త రిలీఫ్ దక్కింది.

ఇలా వల్లభనేని వంశీ చేతిలో తిట్లు తిన్న రాజేంద్రప్రసాద్ బాగా అప్‌సెట్ అయ్యారని చెబుతున్నారు. వంశీపై రాజేంద్రప్రసాద్ అభిమానులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చర్చల్లో ప్రత్యర్థులను పూచికపుల్లతో సమానంగా ట్రీట్ చేసే రాజేంద్రప్రసాద్‌కు ఈ స్థాయిలో కౌంటర్ ఇప్పటి వరకు ఎదురుకాలేదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు సొంత పార్టీకి చెందిన వాడే కావడం, చాలా సీక్రెట్లు వంశీకి తెలిసి ఉండడంతో రాజేంద్రప్రసాద్‌ పప్పులు ఈసారి ఉడకలేదని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ షాక్‌ నుంచి రాజేంద్రప్రసాద్‌ తేరుకోవడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టకపోవచ్చని, ఆయనకు ఇలాంటివి మామూలేనని అంటున్నారు.