బాలయ్య సినిమాపై అదిరిపోయే అప్ డేట్

తనకు అద్భుతంగా కలిసొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు బాలయ్య. ఈ మేరకు ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. బ్యానర్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ను అనుకుంటున్నారట.

బోయపాటి సినిమాల్లో విలన్లు భయంకరంగా ఉంటారు. హీరోకు ఎంత వెయిట్ ఉంటుందో, విలన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. బాలయ్యతో చేయబోయే సినిమాకు కూడా అలాంటిదే ఓ భయంకరమైన విలన్ పాత్రను డిజైన్ చేసుకున్నాడట బోయపాటి. ఈ పాత్రకు సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. బాలయ్య సినిమాకు సంబంధించి కచ్చితంగా క్రేజీ అప్ డేట్ ఇది.

మరోవైపు ఈ సినిమాలో కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన రచితా రామ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. డిసెంబర్ లో బాలయ్య-బోయపాటి సినిమా ప్రారంభమౌతుంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.