దొంగ టీజర్ వచ్చేసింది

ఖైదీ సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న కార్తి, షార్ట్ గ్యాప్ లోనే మరో మూవీ రెడీ చేశాడు. ఈ సినిమాకు దొంగ అనే టైటిల్ పెట్టారు. ఈరోజు టీజర్ కూడా రిలీజ్ చేశారు. నాగార్జున చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజైంది. నిజానికి ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ అనుకున్నారు. ఆఖరి నిమిషంలో దొంగగా టైటిల్ మార్చారు.

సినిమాలో అక్కాతమ్ముళ్ల అనుబంధం ఉంది. కార్తికి అక్కగా జ్యోతిక నటించింది. తమిళ్ లో దీనికి తంబి (తమ్ముడు) అనే టైటిలే పెట్టారు. తెలుగులో మాత్రం కాస్త మాస్ అప్పీల్ కోసం దొంగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సినిమాలో కార్తి ఓ దొంగ.

గతంలో దృశ్యం లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈరోజు రిలీజైన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరలోనే ట్రయిలర్ కూడా లాంఛ్ చేసి, డిసెంబర్ మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. తెలుగులో ఖైదీ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో, ఈ దొంగ సినిమాకు మంచి మార్కెట్ జరుగుతోంది.