రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్‌… వర్మ సీక్వెల్‌

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ.. వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ టీడీపీ క్యాంపును ఇరిటేషన్‌కు గురి చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ … చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు నేపథ్యంలో తనకు కొత్త ఆలోచన వచ్చిందని వర్మ ప్రకటించారు.

వల్లభనేని వంశీ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత… ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సీక్వెల్‌ ఆలోచన వచ్చిందని వర్మ ట్వీట్ చేశాడు. టైటిల్ కూడా ప్రకటించాడు. ” రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్” టైటిల్ అని ట్వీట్ చేశాడు వర్మ.