సినిమా ఫ్లాప్…. రకుల్ కు మరో ఛాన్స్

ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి సదరు హీరో చాలా ఆలోచిస్తాడు. అంతేకాదు, ఆ సినిమాలో తన సరసన నటించిన హీరోయిన్ ను రిపీట్ చేయడానికి కూడా ఆలోచిస్తాడు. కానీ నాగ్ మాత్రం అస్సలేం ఆలోచించలేదు. మన్మథుడు2 ఫ్లాప్ అయినప్పటికీ రకుల్ ను పిలిచి మరీ మరో ఛాన్స్ ఇస్తున్నాడు.

త్వరలోనే సోలమన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు నాగ్. ఇతడు గతంలో వంశీ పైడిపల్లి వద్ద ఊపిరి, మహర్షి సినిమాలకు వర్క్ చేశాడు. అతడ్ని నాగ్ ఇప్పుడు దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. ఈ నెలలోనే సినిమాను అధికారికంగా ప్రకటించి, వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ను తీసుకున్నాడు.

నిజానికి మన్మథుడు2 సినిమాలో నాగ్-రకుల్ జంటకు పెద్దగా మార్కులు పడలేదు. నాగ్ సరసన రకుల్ మరీ చిన్న పిల్లగా ఉందంటూ విమర్శలు చేశారు చాలామంది. అది నిజం కూడా. కానీ నాగ్ ఇప్పుడు ఆ విమర్శల్ని పట్టించుకోలేదు. రకుల్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.