తిరుమల లడ్డు ధర పెంచడం లేదు… వదంతులు సృష్టిస్తున్న వారిపై చర్యలు

తిరుమల లడ్డు ధరలు భారీగా పెరుగుతున్నాయంటూ రెండు మూడు రోజులుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. తిరుమలలో భక్తులకు ఇచ్చే రాయితీ లడ్డు కారణంగా నష్టాలు వస్తుండడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు లడ్డు ధరను రెట్టింపు చేయబోతున్నారని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల లడ్డు ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. వదంతులను నమ్మవద్దని కోరారు.

కొందరు పనిగట్టుకుని ఇలాంటిప్రచారం చేస్తున్నారని… ఇలా వదంతులు సృష్టిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.