మారుతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా!

ప్రతి హీరోకు, హీరోయిన్ కు ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకులకు కూడా ఓ సెంటిమెంట్ ఉంటుంది. అసలు ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ మయం. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా ఓ సెంటిమెంట్ ను బయటకు లాగాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం, ప్రతి రోజూ పండగే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నాడు.

గతంలో ఓసారి భలే భలే మగాడివోయ్ కథను చిరంజీవికి వినిపించాడట మారుతి. ఆ కథ విన్న చిరంజీవి స్టోరీ చాలా బాగుందని మెచ్చుకున్నారట. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతిరోజూ పండగే సినిమా కథను చిరంజీవికి వినిపించాడట. దాదాపు 3 గంటల పాటు కథ విన్న మెగాస్టార్, స్క్రిప్ట్ చాలా బాగుందని మెచ్చుకున్నారట. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చెబుతున్నాడు మారుతి.

మారుతి సెంటిమెంట్ నిజం కావాలనే కోరుకుందాం. అన్నట్టు ఈ సినిమాలో తన హీరోకు మతిమరుపు, అతిశుభ్రత లాంటి ఓసీడీల్ని పెట్టలేదని స్పష్టంచేశాడు మారుతి. సాయితేజ్ ఎన్నారై రిటర్న్ గా కనిపిస్తాడని, సినిమాలో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు.