మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

ఇప్పటికే టీటీడీ విధానాలు, నిర్ణయాల విషయంలో వైసీపీ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది.

తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇక నుంచి ప్రాంతీయ బ్యాంకుల్లో కాకుండా జాతీయ బ్యాంకులలోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే 1500 కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు హయాంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో జమచేశారు. దీనిపై పలువురు భక్తులు హైకోర్టులో పిటీషన్ వేశారు. గతంలో 1400 కోట్లను ఓ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై కూడా అభ్యంతరం తెలిపారు.

ప్రైవేటు బ్యాంకులకు టీటీడీ ద్వారా లాభం కలిగేలా తెరవెనుక మంత్రాంగం నడిచిందని వైసీపీ భావిస్తోంది. అందుకే ఉన్న పళంగా ఇకపై శ్రీవారి సొమ్మును జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. ఎస్.బీ.ఐ, యూబీఐ లాంటి జాతీయ ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఇకపై సొమ్ము జమచేయనుంది.

అయితే ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. 5వేల కోట్ల వరకూ డిపాజిట్ చేయవచ్చు. కానీ జాతీయ బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా ఇస్తారు. కాకపోతే ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టిన బంగారానికి భద్రత పెద్దగా ఉండదు. ఇతర అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి.

దీంతో అక్రమాలకు చెక్ చెప్పడానికి టీటీడీ సొమ్మును జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలని…. టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.