ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ

కథ ప్రకారం.. ఆర్-ఆర్-ఆర్ లో ఎన్టీఆర్ సరసన విదేశీ నటి ఉండాలి. అందుకే సినిమా ప్రారంభంలోనే ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ ఆమె ఆదిలోనే తప్పుకుంది. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని తాజాగా భర్తీ చేశారు.

ఆర్-ఆర్-ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే విదేశీ అమ్మాయి పాత్ర కోసం ఒలీవియో మోరిస్ ను తీసుకున్నారు. ఈమె అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్. పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించనుంది. #RRRలో ఆమె క్యారెక్టర్ పేరు జెన్నిఫర్. త్వరలోనే ఆమె సెట్స్ లోకి రాబోతోంది. సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వివరాలతో పాటు మరో 2 అప్ డేట్స్ కూడా ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. సినిమాలో నటించే మరో 2 విదేశీ పాత్రల్ని కూడా పరిచయం చేశాడు. సినిమాలో ఏలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ నటిస్తారని ప్రకటించాడు. స్కాట్ అనే విలన్ పాత్రలో స్టీవెన్ సన్, లేడీ స్కాట్ అనే మరో విలన్ పాత్రలో ఎలిసన్ డూడీ కనిపించబోతున్నారు.