రూలర్ టీజర్.. బాలయ్య ట్రోలింగ్

నిన్న సాయంత్రం రూలర్ టీజర్ రిలీజైంది. టీజర్ ఇలా వచ్చిందో లేదో అలా లైకులు, షేర్లు పెరిగాయి. అయితే అదే సమయంలో బాలయ్యపై ట్రోలింగ్ కూడా మొదలైంది. సినిమాలో బాలయ్య గెటప్ అస్సలు బాగాలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

రూలర్ సినిమాలో బాలయ్య గెటప్స్ ఆడియన్స్ కు కొత్తేంకాదు. అతడికి సంబంధించిన రెండు గెటప్స్ ను చాన్నాళ్ల కిందటే పోస్టర్ల రూపంలో విడుదల చేశారు. అయితే పోస్టర్లలో చూపించిన లుక్ కు, టీజర్ లో బాలయ్య వీడియోలకు అంతగా సింక్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా ఓ గెటప్ లో బాలయ్య విగ్గు, మరో గెటప్ లో గడ్డం అస్సలు సూట్ అవ్వలేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, మరోవైపు దిట్టంగా ఉండాల్సిన బాలయ్య సడెన్ గా స్లిమ్ అయిపోవడం కూడా చాలామందికి నచ్చలేదు. ఆ స్లిమ్ లుక్ లో పోలీస్ గెటప్ అస్సలు సూట్ అవ్వలేదని, పైగా మనిషి తగ్గినా పొట్ట మాత్రం అలానే ఉండడంతో, యూనిఫామ్ లో మరింత ఎబ్బెట్టుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.