అశ్వద్ధామ మోషన్ పోస్టర్ అదిరింది

నాగశౌర్య అప్ కమింగ్ మూవీ అశ్వద్ధామ. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఈరోజు రిలీజైన మోషన్ పోస్టర్ చూస్తే ఆ ఆసక్తి ఇంకాస్త పెరగడం గ్యారెంటీ. అవును.. అశ్వద్ధామ మోషన్ పోస్టర్ బాగుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంది.

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయనే విషయాన్ని సెట్స్ పై ఉండగానే ఆడియన్స్ గ్రహించారు. ఎందుకంటే, ఇదే సినిమా షూటింగ్ లో ఓ యాక్షన్ సీన్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు శౌర్య. జాగ్రత్తగా గమనిస్తే, మోషన్ పోస్టర్ లో ఆ సీన్ కూడా ఉంది.

మరో ఎట్రాక్షన్ ఏంటంటే.. ఈ సినిమాకు నాగశౌర్య కథ అందించాడు. ఆ కథను రమణతేజ డైరక్ట్ చేస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 90శాతం పూర్తయింది.