థియేటర్లలోకి వచ్చిన వర్మ సినిమా….

ఊహించని విధంగా ఆఖరి నిమిషంలో వర్మ సినిమాకు లైన్ క్లియర్ అయింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై నిన్నంతా ఎడతెగని సస్పెన్స్ కొనసాగింది.

హైకోర్టు వాదనల తర్వాత ఊహించని విధంగా సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఏపీ, తెలంగాణలో ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

హైకోర్టులో నిన్న ఈ సినిమాపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా బోర్డు ఇబ్బంది పెడుతోందని యూనిట్ తరఫున లాయర్లు వాదించారు. దీనిపై సెన్సార్ బోర్డు కూడా తమ వాదనలు వినిపించింది. ఒక దశలో హైకోర్టు కూడా సెన్సార్ బోర్డుకు అనుకూలంగా వ్యవహరించింది.

హైకోర్టు వాదనల కంటే ముందు సెన్సార్ బోర్డు ముందు ఆ సినిమా యూనిట్ సభ్యులు ధర్నా చేశారు. ఇలా ఎంతో హైడ్రామా నడిచిన తర్వాత సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ దక్కింది. యూ/ఏ సర్టిఫికేట్ తో సినిమాను ఓకే చేశారు.