పవన్ కు జన స్పందన రానురాను ఇంకా తగ్గుతుంది…

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పవన్ నిర్వహించిన దీక్షకు కనీస జన స్పందన లేని నేపథ్యంలో రాపాక అసెంబ్లీ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.

చిన్నచిన్న విషయాలకే దీక్షలు చేయడం సరి కాదన్నారు. రానురాను పవన్ కార్యక్రమాలకు జన స్పందన మరింత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పవన్ కార్యక్రమాలకు పది మంది నేతలు మాత్రమే హాజరవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇతర కారణాలతో పవన్‌ సభకు వెళ్లలేదని చెప్పారు.