ఫ్లాప్ సినిమాకు పెద్ద నిర్మాతల అండ

తూటా.. ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. తమిళనాట ఈ సినిమా ఆల్రెడీ రిలీజైంది. విడుదలై 2 వారాలు పైనే అవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా ఎక్కడా లేదు. అలా ఫ్లాప్ అయిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాతలు తొందరపడుతున్నారు. అదే ఇక్కడ విడ్డూరం.

నైజాంలో ఈ సినిమాను ఏకంగా ఏషియన్ సునీల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక సీడెడ్ లో ఎన్వీ ప్రసాద్ పంపిణీ చేస్తున్నారు. వీళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కాస్త పేరున్న డిస్ట్రిబ్యూటర్లే రంగంలోకి దిగి పంపిణీ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఫ్లాప్ అయిందని తెలిసి కూడా తెలుగులో ఈ సినిమాపై వీళ్లంతా ఇంత ఇంట్రెస్ట్ చూపించడం నిజంగానే విడ్డూరం.

ప్రస్తుతం మార్కెట్లో స్లంప్ నడుస్తోంది. మత్తువదలరా, ప్రతిరోజూ పండగ తప్ప మిగతా సినిమాలేవీ ఆడడం లేదు. పండగ సినిమాల ప్రభావంతో ఓ మోస్తరు బజ్ ఉన్న మూవీస్ ఏవీ థియేటర్లలోకి రావట్లేదు. అందుకే ఖాళీగా మారుతున్న థియేటర్లను ఇలా తూటా లాంటి సినిమాలతో నింపాలని నిర్మాతలు చూస్తున్నట్టున్నారు. అన్నట్టు తూటాతో పాటు ఊల్లాల-ఊల్లాల, అతడే శ్రీమన్నారాయణ, హల్ చల్, వైఫ్ ఐ లాంటి ఎన్నో సినిమాలు రాబోయే 2-3 రోజుల్లో థియేటర్లలోకి వస్తున్నాయి. సంక్రాంతిలోపు అంతోఇంతో క్యాష్ చేసుకోవాలనేది వీటి తపన.