వకీల్ సాబ్ బ్యూటీ ఫిక్స్ అయింది

పవన్ రీఎంట్రీ ఇస్తున్న మూవీ వకీల్ సాబ్. కెరీర్ లో 26వ చిత్రంగా పవన్ చేస్తున్న వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు కాస్త సస్పెన్స్ ఉండేది. ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి, శృతిహాసన్ ఇలా చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి. ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తేలిపోయింది. ఆమె మరెవరో కాదు శృతిహాసన్.

నిజానికి ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని దిల్ రాజు గట్టిగా భావించాడు. దీనికి కారణం ఒకటే. ఆమె కాల్షీట్లు రెడీగా ఉన్నాయి. పైగా చాలా తక్కువ రెమ్యూనరేషన్ కు చేయడానికి ఆమె ఒప్పుకుంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోలేదు. పవన్ సరసన లావణ్య లాంటి హీరోయిన్ ను కాకుండా.. కాజల్, శృతిహాసన్, సమంత లాంటి హీరోయిన్ ను పెట్టాలని డిమాండ్ చేశారు.

దీంతో ఫ్యాన్స్ డిమాండ్ కు దిల్ రాజు తలొగ్గక తప్పలేదు. అందుకే తనకు బాగా పరిచయమున్న శృతిహాసన్ ను సినిమాలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం శృతిహాసన్, రవితేజతో క్రాక్ అనే సినిమా చేస్తోంది. అటు తమిళ్, హిందీలో కూడా 2 సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె కాల్షీట్లు దొరకడం కష్టమే. అయినప్పటికీ దిల్ రాజు ఎలాగోలా పట్టేశాడు.

అయితే పవన్ కాల్షీట్లతో శృతిహాసన్ కాల్షీట్లు ఎలా మ్యాచ్ అవుతాయనేది ఇప్పుడు అందరి డౌట్. ఇంతకుముందు పవన్-శృతిహాసన్ కలిసి కాటమరాయుడు అనే సినిమా చేశారు.