అలియాభట్ పై క్లారిటీ ఇచ్చిన యూనిట్

బాలీవుడ్ లో ఆమె ఎంత వైరల్ అయిందో తెలీదు కానీ, 2-3 రోజులుగా టాలీవుడ్ లో మాత్రం యమ పాపులర్ అయింది ఈ చిన్నది. దీనికి కారణం ఆర్ఆర్ఆర్ కు సంబంధించి వచ్చిన ఓ వార్త. ఈ సినిమా నుంచి ఈమె తప్పుకుందని, ప్రస్తుతం రాజమౌళి మరో హీరోయిన్ కోసం వెదుకుతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అలియా భట్ ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఈ గాసిప్ వచ్చిన మొదటి రోజే యూనిట్ చెవిన పడింది. కాకపోతే దాన్ని లైట్ తీసుకుంది. వాళ్లు ఇలా లైట్ తీసుకోవడం, ఈ గాసిప్ వైరల్ అవ్వడం ఒకేసారి జరిగిపోయాయి. దీంతో గత్యంతరం లేక, ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్ ఉందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చింది యూనిట్. తమ సినిమాలో అలియాభట్ ఉందని… ఏప్రిల్ మూడో వారం లేదా మే నెల నుంచి ఆమె షూటింగ్ కు వస్తుందని ఫీలర్ వదిలారు.

నిజానికి అలియాభట్ గతేడాదే ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి రావాల్సింది. పూణెలో జరగాల్సిన షెడ్యూల్ లో అలియాభట్ జాయిన్ అవ్వాల్సింది. యూనిట్ అంతా అక్కడకు చేరుకుంది కూడా. అంతలోనే రామ్ చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మొత్తంగా పూణె షెడ్యూల్ నే కాన్సిల్ చేసేశారు. అప్పట్నుంచి ఈ క్షణం వరకు తిరిగి ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి అలియాభట్ రాలేదు.

యూనిట్ అడిగినప్పుడు అలియా వద్ద కాల్షీట్లు లేవు. అలియా ఫ్రీగా ఉన్నప్పుడు కరోనా వచ్చి షూటింగ్ కాన్సిల్ చేసింది యూనిట్. దీంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఖండించింది.