ఈ హీరోయిన్ ఫొటోషూట్స్ పనిచేయలేదు

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. అయితే ఎక్కువగా లావణ్య త్రిపాఠి పేరు వినిపించింది. దీంతో ఆ హీరోయిన్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. అందర్నీ ఆకర్షించేందుకు ఆమధ్య వరుసగా ఫొటో షూట్స్ రిలీజ్ చేసింది. ఆమె నుంచి కనీసం 2 రోజులకు ఒక ఫొటో సెషన్ మీడియాలో కనిపించేది.

ఇలా పరోక్షంగా ఫొటోషూట్స్ తో యూనిట్ ను ఎట్రాక్ట్ చేయాలన్న లావణ్య త్రిపాఠి ఆలోచన బెడిసికొట్టింది. ఈ సినిమాలో లావణ్య బదులు శృతిహాసన్ ను తీసుకున్నారు. పవన్ కల్యాణ్ స్టామినాకు, అతడి స్టార్ డమ్ కు లావణ్య సరిపోదని ఫ్యాన్స్ నుంచి విపరీతంగా ఒత్తిడి రావడంతో దిల్ రాజు, ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని శృతిహాసన్ ను తీసుకున్నాడు.

తన పాచిక పారకపోవడంతో లావణ్య ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. దీంతో మొన్నటివరకు వరుసపెట్టి విడుదల చేసిన ఫొటోషూట్స్ ను ఆపేసింది. ప్రస్తుతం ఆమె నుంచి పాత ఫొటోలు తప్ప కొత్తగా ఫొటోషూట్స్ రావడం లేదు. అసలే కెరీర్ అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి టైమ్ లో పవన్ సరసన ఛాన్స్ వస్తే దూసుకుపోవచ్చని అనుకుంది లావణ్య. కానీ ఆమె కల, కలగానే మిగిలిపోయింది.