డాన్స్ మాస్టర్ దర్శకత్వంలో సూపర్ స్టార్

ఓవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరోవైపు సినిమాలు మాత్రం తగ్గించలేదు రజనీకాంత్. బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కెరీర్ లో తన 170వ సినిమాకు చేరువయ్యారు సూపర్ స్టార్. ఈ ప్రతిష్టాత్మక సినిమాను ఎవరి చేతిలో పెడదామనే ఆలోచనలో ఉన్నారు రజనీకాంత్.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లోనే రజనీకాంత్ కు ఓ అద్భుతమైన స్టోరీలైన్ వినిపించాడు కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ లారెన్స్. దీంతో లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేస్తాడనే ప్రచారం కోలీవుడ్ లో ఊపందుకుంది. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ పై ఎలాంటి క్లారిటీ లేదు. శివ దర్శకత్వంలో చేస్తున్న అన్నాత్తి సినిమా పూర్తయిన తర్వాతే రజనీకాంత్ ఏ నిర్ణయమైనా తీసుకుంటారు.

అయితే వరుసపెట్టి సినిమాలైతే చేస్తున్నాడు కానీ రజనీకాంత్ ఆశిస్తున్న సక్సెస్ ను మాత్రం ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. చివరికి హీరోయిజాన్ని పీక్స్ లో చూపిస్తాడనే పేరున్న మురుగదాస్ కూడా రజనీకాంత్ కు దర్బార్ లాంటి యావరేజ్ సినిమానే ఇచ్చాడు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లేముందు ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలనేది సూపర్ స్టార్ ఆశ. ఆ ఆశను కనీసం లారెన్స్ అయినా తీరుస్తాడేమో చూడాలి.