కరోనాపై పోరులో….. చిరంజీవి తల్లి

కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు మార్కెట్లో మాస్కుల కొరత, శానిటైజర్ల కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి తల్లి కరోనాపై పోరుకు నడుం బిగించారు. అంత పెద్ద వయసులో మొక్కవోని పట్టుదలతో మాస్కులు కుట్టడం మొదలు పెట్టింది.

చిరంజీవి తల్లి అంజనాదేవి గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్ లను కుట్టారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా చిరంజీవి తల్లి మాస్కులు కుట్టి అవసరమైన వారికి అందజేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటికే సినీ కార్మికులను ఆదుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి సాయం చేస్తుండగా.. ఆయన తల్లి సైతం కరోనా పోరులో తనవంతు సాయం చేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భార్య సైతం మాస్కులు కుడుతూ అవసరమైన వారికి అందజేస్తోంది.