ఆర్ఆర్ఆర్ వాయిదా…. చిరంజీవికి ఇబ్బందే !

బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను కలిపి తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి.  జనవరి 8కి విడుదలను ఖాయం చేసిన ఈ మూవీ కరోనా దెబ్బతో వాయిదా పడే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ ఆలస్యం ఖాయం కావడంతో… 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందో లేదోనన్న టెన్షన్ నెలకొంది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ లేట్ అయితే ఆ ప్రభావం మెగాస్టార్ చిరంజీవి చిత్రంపై భారీగా పడనుంది. ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి.. చిరంజీవి ‘ఆచార్య’ వచ్చే సమ్మర్ కి ప్లాన్ చేశారు. ఇందులో రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లో లుక్ బయటపడకుండా దీని తర్వాతే చిరంజీవి సినిమా విడుదల చేయాలని రాజమౌళి షరతు పెట్టాడట.. సో ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే ‘ఆచార్య’ కూడా వాయిదా పడుతుంది.

అయితే ఆర్ఆర్ఆర్ తో సంబంధం లేకుండా ముందుగానే విడుదల చేసుకునేలా రాజమౌళిని చరణ్, చిరంజీవి ఒప్పించడానికి చూస్తున్నట్టు తెలిసింది. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట.. మరి ఆర్ఆర్ఆర్ కు ముందే చరణ్ నటిస్తున్న ఆచార్య విడుదలకు జక్కన్న ఒప్పుకుంటాడా లేదా అన్నది వేచిచూడాలి.