ఏపీ కొత్త ఏస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియమితులయ్యారు. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వి.కనగరాజ్ పనిచేశారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా రామసుందరరెడ్డిని నియమించింది. ఆయన కూడా రేపోమాపో బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

స్టేట్‌ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామకం జరిగింది. విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి న్యాయమూర్తిగా వి.కనగరాజ్‌ కీలక తీర్పులు ఇచ్చారు.