హైపర్ ఆది పెళ్లి ఫిక్స్…

హైపర్ ఆది. బుల్లితెర జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తన కామెడీ పంచుల వర్షంతో పాపులర్ అయిన కమెడియన్. కొద్దికాలంలో నవ్వులు పూయించే స్కిట్ లతో కోట్ల మందికి అభిమాన కమెడియన్ అయ్యాడు. ఆది పంచులకు జబర్ధస్త్ వీక్షకులు పడిపడి నవ్వుతుంటారు.

ఇప్పుడు సినిమాలు, జబర్ధస్త్, ఢీ షో సహా పలు విభిన్నమైన షోలలో పాల్గొంటూ బాగా సంపాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదికి పెళ్లిని ఫిక్స్ చేశారు అతడి తల్లిదండ్రులు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని హైపర్ ఆది ఖాయం చేశాడు. తనకు వివాహం నిశ్చయమైందని హైపర్ ఆది సంచలన విషయం చెప్పాడు.

యాంకర్ వర్షిణితో హైపర్ ఆదికి ఎఫైర్ ఉందని ఈ మధ్య ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిని ఎప్పుడూ ఆది ఖండించలేదు.

అయితే తాజాగా తను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వధువు ఎవరనే విషయాన్ని కూడా చెప్పి షాకిచ్చాడు.

మా తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూశారని.. ఆమెది సొంత జిల్లా ప్రకాశం అని.. వచ్చే ఏడాది ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్టు హైపర్ ఆది ప్రకటించాడు. దీంతో ఆది తన సొంత జిల్లా అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్టు అర్థమైంది.