నితిన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 సినిమాలు చేస్తున్నాడు నితిన్. వీటిలో 2 సినిమాలకు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు. మిగిలిన ఒక్క సినిమాకు తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. నితిన్ సినిమాలో ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.

సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై ఈమధ్య కొత్తగా సినిమా లాంఛ్ చేశాడు నితిన్. హిందీలో సూపర్ హిట్టయిన అంథాధున్ సినిమాకు రీమేక్ గా ఇది రాబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను సెలక్ట్ చేశారు. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత ప్రియాంక మోహన్ కు ఇది రెండో సినిమా.

ప్రస్తుతం కీర్తిసురేష్ హీరోయిన్ గా రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జైల్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రియాంక మోహన్ తో కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఇలా ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో, మూడు సెట్స్ పై రొమాన్స్ చేయబోతున్నాడు నితిన్.