రష్మిక అందుకు ఒప్పుకుంటుందా?

రష్మికకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆలోచించడానికేం లేదు. ఎవరైనా వెంటనే ఒప్పుకోవాల్సిందే. కానీ రష్మిక మాత్రం ఆలోచనలో పడింది. ఆఫర్ ఒప్పుకోవాలా వద్దా అనే సందిగ్దంలో పడింది. దీనికి కారణం అది సెకెండ్ హీరోయిన్ పాత్ర కావడమే.

అవును.. ఆచార్య సినిమాలో 30 నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ పాత్రకు హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నారు. మెయిన్ హీరోయిన్ గా ఆల్రెడీ కాజల్ ఉంది. సో.. ఈ చిన్న పాత్రకు ఒప్పుకుంటే కెరీర్ దెబ్బతింటుందేమో అని ఆలోచిస్తోంది రష్మిక.

అయితే ఇక్కడే ఆమెకు మెగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆచార్యలో ఈ చిన్న పాత్రకు సై అంటే.. భవిష్యత్తులో తను చేసే సినిమాలో సోలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని చరణ్, రష్మికకు మాటిచ్చాడట. సో.. రష్మిక ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

గతంలో శృతిహాసన్ విషయంలో మహేష్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఆగడులో ఐటెంసాంగ్ చేసినందుకు గాను, ఆ వెంటనే వచ్చిన శ్రీమంతుడులో ఆమెకు హీరోయిన్ రోల్ ఆఫర్ చేశాడు. ఇప్పుడు చరణ్ కూడా రష్మిక విషయంలో అదే రూటు ఫాలో అవుతున్నాడన్నమాట.