ప్రభాస్ సరసన దీపికా పదుకోన్

త్వరలోనే నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. దీన్ని పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్-వరల్డ్ సినిమాగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. కాబట్టి ఇందులో హీరోయిన్ గా కచ్చితంగా బాలీవుడ్ భామనే తీసుకుంటారు. ఈ క్రమంలో అలియాభట్, కత్రినాకైఫ్ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా దీపిక పదుకోన్ పేరు కూడా తెరపైకొచ్చింది.

అలియాభట్ ఆల్రెడీ తెలుగులో ఓ సినిమా చేస్తోంది కాబట్టి.. ప్రభాస్ సరసన కూడా నటించే ఛాన్స్ ఉందంటూ లాజిక్ తీశారు జనాలు. కత్రినాకైఫ్ కు గతంలో టాలీవుడ్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రభాస్ మూవీ కోసం సంప్రదించి ఉంటారనే లాజిక్ కూడా తెరపైకొచ్చింది. మరి దీపికా పదుకోన్ పేరు తెరపైకి రావడానికి లాజిక్ ఏంటి?

రీసెంట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాపై స్పందించింది దీపిక పదుకోన్. సినిమా చాలా బాగుందని, అంతా చూడాలని కోరింది. ప్రభాస్ సరసన ఆమె నటించే అవకాశం ఉందంటూ కథనాలు రావడానికి ఇదే కారణం. ప్రభాస్ మూవీ కోసం దీపికను కలిశాడట నాగ్ అశ్విన్. తన దర్శకత్వ ప్రతిభను చెప్పేందుకు మహానటి సినిమాను చూడమని కోరాడట. అలా మహానటి సినిమా చూసిన దీపిక.. ఆ సినిమా చాలా బాగుందని మెచ్చుకుందట. ఇదీ ప్రస్తుతం వైరల్ అవుతున్న మేటర్.