మహేష్ కొత్త సినిమా కథ ఇదేనా!

ఇలా టైటిల్ రిలీజ్ అయిందో లేదో అలా కథలు అల్లేస్తున్నారు మహేష్ అభిమానులు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అరడజనుకు పైగా కథలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో 2 మాత్రం కాస్త నమ్మేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం పొందుతున్న స్టోరీలు ఇవే.

కథ-1

సర్కారు వారి పాట సినిమా టైటిల్ ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ నాన్న బ్యాంక్ మేనేజర్. ఆ బ్యాంక్ నుంచి ఓ బడా బిజినెస్ మేన్ వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాడు. కానీ చెల్లించకుండా పరారవుతాడు. దీంతో ఆ వ్యవహారం బ్యాంక్ మేనేజర్ మెడకు చుట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగుతాడు మహేష్ బాబు. సదరు వ్యాపారవేత్త మెడలు వంచి డబ్బు మొత్తం తిరిగి బ్యాంకుకు చెల్లించేలా చేస్తాడు.

కథ-2

మహేష్ బాబు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ల నాన్న తన ఇంటిని కోల్పోతాడు. బ్యాంక్ వారు ఆ ఇంటిని వేలం పాట వేసి అమ్మేస్తారు. పెద్దయిన తర్వాత మహేష్ ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. తిరిగి ఆ ఇంటిని సొంతం చేసుకొని అందులో నాన్నను చూడాలనుకుంటాడు. అనుకున్నది సాధించే క్రమంలో ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమిస్తాడు.

చదివారుగా.. సర్కారు వారి పాట సినిమా కథ ఇదేనంటూ ప్రస్తుతం ఈ రెండు స్టోరీలైన్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం వీటిని ఓ రేంజ్ లో షేర్ చేస్తూ, లైకులు కొడుతూ ఆనందపడుతున్నారు.