చెప్పిన తేదీకే రానా పెళ్లి

రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేశాడు రానా. ఆమెతో రోకా ఫంక్షన్ కూడా పూర్తయింది. ఇక మిగిలింది పెళ్లి వేడుక మాత్రమే. ఆ తేదీని కూడా రీసెంట్ గా సురేష్ బాబు ప్రకటించారు. ఓ మీడియా సంస్థతో ఆన్ లైన్ లో మాట్లాడిన సురేష్ బాబు.. ఆగస్ట్ 8న రానా-మిహీకాల పెళ్లి జరిపిస్తామని ప్రకటించారు.

అయితే 2 రోజులుగా రానా పెళ్లిపై పుకార్లు చెలరేగాయి. చెప్పిన తేదీకి ఆయన పెళ్లి జరక్కపోవచ్చంటూ కథనాలు వచ్చాయి. దీనికి కారణం కరోనా వైరస్. లాక్ డౌన్ దశలవారీగా ఎత్తేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం ఆగస్ట్ వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఆగస్ట్ 8న అనుకున్న రానా పెళ్లి వాయిదా పడే అవకాశాలున్నట్టు కథనాలు వచ్చాయి. వీటిపై దగ్గుబాటి కాంపౌండ్ రియాక్ట్ అయింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 8నే రానా-మిహీకాల పెళ్లి ఉంటుందని స్పష్టంచేసింది. దీంతో రానా పెళ్లిపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.