సుధీర్ తో ఎఫైర్ పై రష్మి

బుల్లితెరపై మోస్ట్ హాట్ కపుల్ సుధీర్-రష్మి. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. వీళ్లను భార్యభర్తలు అనుకున్న జనాలు కూడా ఉన్నారు. కానీ సుధీర్ తో తన అనుబంధం కేవలం తెరవరకే పరిమితం అని రష్మి ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఈ జంటపై పుకార్లు ఆగడం లేదు.

సుధీర్ తో రిలేషన్ షిప్ పై మరోసారి రియాక్ట్ అయింది రష్మి. ఆన్ స్క్రీన్ లో తామిద్దరం హాట్ గా ఉంటామని, అంతకుమించి ఇద్దరి మధ్య ఇంకేం లేదని అంటోంది ఈ బ్యూటీ. సుధీర్ తను నిజంగా ప్రేమికులేనని చాలామంది అనుకుంటున్నారని, అంతా అలా అనుకుంటున్నారంటే తెరపై తమ నటన బాగున్నట్టేనని జోకులేస్తోంది.

ఈటీవీలో జరిగిన ఓ కార్యక్రమంలోనైతే సుధీర్-రష్మి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు. దానికి నాగబాబు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. వీళ్లిద్దరి బంధంపై ఆ రేంజ్ లో పుకార్లు నడుస్తున్నాయి. కానీ రష్మి మాత్రం అలాంటిదేం లేదంటోంది. సుడిగాలి సుధీర్ కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకుమించి ఇద్దరి మధ్య ఇంకేం లేదంటోంది.