లాక్ డౌన్ లో చైతూ చేసిన పని ఇది

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఎవరికి నచ్చిన పనులు వాళ్లు చేసుకున్నారు. అంతా కామన్ గా ఓటీటీకి మాత్రం ఫిక్స్ అయ్యారు. తాము చేసిన పనుల్ని హీరోయిన్ లంతా బయటపెట్టారు. చివరికి మీడియాకు దూరంగా ఉండే అనుష్క లాంటి హీరోయిన్లు కూడా బయటకొచ్చారు. మరి హీరోలు ఏం చేశారు?

దీనిపై పెద్దగా ఎవ్వరికీ క్లారిటీ లేదు. మహేష్ లాంటి హీరో రోజూ తన పిల్లలతో ఆడుతున్నాడనే విషయం మాత్రం అందరికీ తెలుస్తోంది. మిగతా హీరోలు మాత్రం ఈ లాక్ డౌన్ టైమ్ లో తమ ప్రైవేట్ లైఫ్ ను గుంభనంగా ఉంచారు. ఫస్ట్ టైమ్ బడా హీరోల నుంచి నాగచైతన్య స్పందించాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో తను చాలా వెబ్ సిరీస్ లు చూసినట్టు చెప్పుకొచ్చాడు. వాటిలోంచి కొన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు కూడా.

ది ఫ్యామిలీ మేన్, చెర్నోబిల్ లాంటి వెబ్ సిరీస్ లను చూశాడు నాగచైతన్య. తను చూసిన ఒరిజినల్ కంటెంట్ చాలా బాగుందని.. రైటింగ్, ప్రొడక్షన్ వర్క్ చాలా బాగుందని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు నాగచైతన్య.

మొత్తమ్మీద ఈ లాక్ డౌన్ టైమ్ లో నాగచైతన్య ఏం చేశాడనే విషయం తెలిసిపోయింది. మిగతా హీరోలు కూడా ఇలా స్పందిస్తే ఫ్యాన్స్ కు కొంచెం సరదాగా ఉంటుంది. అసలే సినిమాల్లేక అంతా ఇబ్బంది పడుతున్న టైమ్ లో హీరోలు ఇలా ఫ్యాన్స్ కు దూరంగా ఇళ్లకే పరిమితం అవ్వడం అస్సలు బాగాలేదు.