రెజీనాకు లైంగిక వేధింపులు

హీరోయిన్లంతా కాస్టింగ్ కౌచ్ గురించి ఒక్కొక్కటిగా బయటపెడుతుంటే మరో హీరోయిన్ రెజీనా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది. తను కూడా వేధింపులకు గురైనట్టు ప్రకటించింది రెజీనా. మిస్టర్ చంద్రమౌళి అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రెజీనా.. తనకు ఎదురైన వేధింపుల గురించి వివరంగా చెప్పుకొచ్చింది.

“చెన్నైలో చదువుకునే రోజుల్లో నన్ను కూడా వేధించారు. కాలేజీ నుంచి వచ్చేదారిలో ఓ థియేటర్ బ్రిడ్జ్ వద్ద నాతో పాటు నలుగురు అమ్మాయిల్ని కొంతమంది కుర్రాళ్లు అడ్డుకున్నారు. రకరకాలుగా మాట్లాడారు. ఒకడు నా పెదవులు తాకడానికి ప్రయత్నించాడు. నేను వాడ్ని అక్కడే రోడ్డుపై కొట్టాను.”

ఇలా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది రెజీనా. ఏ రంగంలో పనిచేస్తున్నామనే అంశంతో సంబంధం లేకుండా మహిళలంతా ధైర్యంగా ఉండాలని, వేధింపులకు గురిచేసే వారి విషయంలో కఠినంగా ఉండాలని కోరుకుంటోంది రెజీనా.