‘అయ్యప్పన్’ కిచిడీ కాబోతోందా

అయ్యప్పనుమ్ కోషియమ్… మలయాళంలో పెద్ద హిట్టయిన సినిమా ఇది. తెలుగులో చాన్నాళ్లుగా నలుగుతున్న ప్రాజెక్ట్ కూడా ఇది. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేయాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు రానా, రవితేజ రూపంలో హీరోలు దొరికేశారు. దీంతో అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో మళ్లీ మరో సమస్య ఎదురైంది.

సినిమా చేయడానికి ఓకే చెప్పిన రానా, ఈ ప్రాజెక్టుకు తనదైన శైలిలో మార్పులు చేస్తానని డిమాండ్ చేశాడట. ఈ మేరకు తన కాంపౌండ్ లో ఉన్న రైటర్స్ తో అయ్యప్పనుమ్ కోషియమ్ కు మరో వెర్షన్ రెడీ చేయించాడట. మరి ఈ వెర్షన్ కు రవితేజ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

ఇక అసలు విషయానికొస్తే, ఈ మలయాళీ సినిమాకు ఆల్రెడీ మార్పుచేర్పులు జరిగిపోయాయి. దర్శకుడు సాగర్ చంద్రకు ఈ బాధ్యతకు అప్పగించిన సితార సంస్థ, ఆ మేరకు పనులు పూర్తిచేసింది. అంతా ఓకే అయిన తర్వాత ఇప్పుడు రానా మరో వెర్షన్ రెడీ చేయిస్తుండడంతో వ్యవహారం మొదటికొచ్చింది. దీంతో అయ్యప్పన్ కిచిడీ కాబోతోందంటూ అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.