రానా పెళ్లి తర్వాతే విరాటపర్వం

హీరో రానా తన పెళ్లి మేటర్ బయటపెట్టిన వెంటనే విరాటపర్వం సినిమాపై అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే బాగా ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవ్వదని అంతా అనుకున్నారు. ఇప్పుడదే జరగబోతోంది. విరాటపర్వం సినిమాను పెళ్లి తర్వాతే మళ్లీ సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు రానా.

ఆల్రెడీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. ఇప్పుడు రానా పెళ్లి కారణంగా ఈ సినిమా మరింత లేట్ అవుతోంది. ఆగస్ట్ 8న రానా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత కనీసం మరో నెల రోజులు గ్యాప్ తీసుకొని సెప్టెంబర్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ గ్యాప్ లో రానాతో సంబంధం లేని సన్నివేశాల్ని పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు వేణు ఊడుగుల.

అదేంటో విరాటపర్వం సినిమాకు ఆది నుంచి అడ్డంకులే. ఈ సినిమా మొదలుపెట్టిన వెంటనే హీరోయిన్ సాయిపల్లవితో కాల్షీట్ల సమస్య ఎదురైంది. ఆ తర్వాత కీలకమైన పాత్రధారులు తప్పుకోవడంతో మరో సమస్య. అన్నీ ఓకే అనుకున్న టైమ్ లో రానా అనారోగ్యానికి గురయ్యాడు. అమెరికాలో అతడికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అలా కొన్నాళ్లు లేట్ అవ్వగా తాజాగా లాక్ డౌన్ కారణంగా మరోసారి షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు రానా పెళ్లితో విరాటపర్వం ఇంకాస్త ఆలస్యం అవుతోంది.