మన్మథుడు హీరోయిన్ ఇప్పుడెక్కడుంది?

నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు సినిమాలో హీరోయిన్ అనగానే ఎవరికైనా సోనాలీ బింద్రే గుర్తొస్తుంది. కానీ అదే సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది అన్షు. తన లుక్స్ తో ఎంతోమందిని ఎట్రాక్ట్ చేసిన అన్షు.. మన్మథుడు తర్వాత పెద్దగా కనిపించలేదు. ప్రభాస్ తో ఓ సినిమా, తమిళ్ లో మరో సినిమా చేసి సీన్ నుంచి మాయమైంది. మరి ఇప్పుడీ ముద్దుగుమ్మ ఎక్కడుంది.. ఏం చేస్తోంది.

3 సినిమాలతోనే కెరీర్ చాలించిన అన్షు.. తను పుట్టిపెరిగిన లండన్ కు వెళ్లిపోయింది. అక్కడే చదువు పూర్తిచేసి, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. సచిన్ సగ్గార్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుంది అన్షు. వాళ్లకు ఓ పాప కూడా ఉంది.

ఓవైపు భర్త బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటుంటే, అన్షు మాత్రం ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తింది. లండన్ లో ఆమెకు ప్రత్యేకంగా ఓ బొటిక్ కూడా ఉంది. ఇలా లైఫ్ లో కూల్ గా సెటిలైపోయింది ఈ ముద్దుగుమ్మ.

View this post on Instagram

Ready to cruise with my little man 😍🚘☀️

A post shared by Actress Anshu (@actressanshuofficial) on