పవన్‌ ఫ్యాన్స్ ఆర్జీవీని ఇలా దెబ్బకొట్టారు…

రామ్ గోపాల్ వర్మను ఎలా దెబ్బకొట్టాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఇప్పుడదే జరిగింది. “పవర్ స్టార్” అనే సినిమాను తన వెబ్ మీడియాలో రిలీజ్ చేశాడు ఆర్జీవీ. దీన్ని అడ్డుకునేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా ప్రయత్నించారు కానీ కుదరలేదు. దీంతో వాళ్లు కూడా రామ్ గోపాల్ వర్మను దొంగ దెబ్బ తీయడానికి రెడీ చేశారు. ఈ ప్రయత్నంలో వాళ్లు సక్సెస్ అయ్యారు కూడా.

పవర్ స్టార్ అనే సినిమాను కేవలం డబ్బుల కోసం తీశాడు వర్మ. అతడికి ఆ డబ్బులు అందకుండా చేయాలని నిర్ణయించుకున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకే సినిమా రిలీజైన క్షణాల్లోనే పవర్ స్టార్ మూవీని పైరసీ చేసి పడేశారు. జస్ట్ 38 నిమిషాల సినిమా కావడంతో… ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇనస్టాగ్రామ్ అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికి చేరవేశారు.

దీంతో డబ్బులు పెట్టి పవర్ స్టార్ సినిమా చూసే జనాలు తగ్గిపోయారు. దీంతో వర్మ డీలా పడిపోయాడు. నిజానికి పవర్ స్టార్ సినిమా కంటే అంతకుముందు వర్మ తీసిన నగ్నం, క్లైమాక్స్ సినిమాలకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఆ విషయాన్ని అతడు ఘనంగా ప్రకటించుకున్నాడు కూడా.

కానీ పవర్ స్టార్ విషయంలో ఎంతమంది తన సినిమా చూశారనే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నాడు ఈ దర్శకుడు. దీనికి కారణం ఈ సినిమా క్షణాల్లో పైరసీ అవ్వడమే. 300 రూపాయలు పెట్టి ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో చూసేకంటే.. పైరసీలో చూడడం బెటరని అంతా ఫిక్స్ అయ్యారు.