ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన శ్రద్ధాదాస్

శ్రద్ధాదాస్ పై బిగ్ బాస్ పుకార్లు ఇప్పటివి కావు. దాదాపు నెల రోజులుగా ఆమెపై ఈ తరహా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈసారి సీజన్-4లో శ్రద్ధాదాస్ దాదాపు ఫిక్స్ అంటూ చాలా కథనాలు వచ్చేశాయి. ప్రారంభంలో ఇలాంటి పుకార్లను జస్ట్ ఖండించి ఊరుకుంది శ్రద్ధ. తను బిగ్ బాస్ సీజన్-4లో పాల్గొనడం లేదని స్పష్టంచేసింది.

ఓవైపు శ్రద్ధాదాస్ క్లియర్ గా ఖండించినప్పటికీ మరోవైపు ఈ పుకార్లు ఆగలేదు. ఒకటికి రెండు జోడించి మరీ కథనాలు రాయడం మొదలుపెట్టారు. దీంతో శ్రద్ధాదాస్ విసిగిపోయింది. చివరి అస్త్రంగా ఏకంగా వెబ్ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇకపై తనను లింక్ చేస్తూ బిగ్ బాస్ కు సంబంధించిన కథనాలు ఇస్తే లీగల్ గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వెబ్ మీడియాను హెచ్చరించింది శ్రద్ధాదాస్. తను క్లారిటీ ఇచ్చినప్పటికీ కొన్ని వెబ్ సైట్స్ పదేపదే కథనాలు ఇస్తున్నాయని, మరోసారి తనను లింక్ చేస్తూ బిగ్ బాస్ కథనాలు కనిపిస్తే.. సదరు మీడియా సంస్థలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ.