జగన్‌ బాటలో తెలంగాణ…. కరోనా టెస్టుల కోసం బస్సులు!

కరోనా కట్టడికి కోసం ఏపీ సీఎం జగన్‌ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. ఆలస్యంగానైనా ఇక్కడి సర్కార్‌ మేల్కొంది. ఏపీలో కరోనా టెస్టుల కోసం జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున సంజీవని బస్సులను జగన్‌ తీసుకొచ్చారు. ఇప్పటికే వీటిని జిల్లాలకు పంపించారు. పెద్ద ఎత్తున టెస్టులు చేయిస్తున్నారు. దీంతో రోజుకు 8వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. టెస్ట్, ట్రేస్‌ పద్ధతిలో ఇప్పుడు అక్కడ నడుస్తోంది. మరో నాలుగు ఐదు రోజుల్లో అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గే అవకాశం కన్పిస్తోంది.

ఏపీ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా బస్సులను ప్రారంభించింది. ఇప్పటికే ఏపీ రూట్లోనే ర్యాపిడ్‌ టెస్టులు చేస్తోంది. తాజాగా మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో బస్‌ ద్వారా పది మంది నమూనాలను ఒకేసారి తీసుకోవచ్చు. దీంతో టెస్టుల సంఖ్య పెంచొచ్చు. ప్రస్తుతం 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.

ఇప్పటికే జగన్‌ తీసుకున్న గ్రామ సచివాలయాలు, నాడు-నేడు నిర్ణయాలు పలు రాష్ట్రాల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు సంజీవని బస్సుల కాన్సెప్ట్‌ను కూడా ఫాలో అవుతున్నారు.