కరోనా టైమ్ లో సెట్స్ పైకి నాగ్

ఈ కరోనా టైమ్ లో షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసినా హీరోలు మాత్రం బయటకు రావడానికి భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య లాంటి సీనియర్లు అస్సలు బయటకు రావడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సెట్స్ పైకొచ్చాడు నాగార్జున.

అవును.. నాగార్జున సెట్స్ పైకొచ్చాడు. ముఖానికి రంగేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్-4 ప్రోమో కోసం ఇలా చాలా ప్రమాదకర పరిస్థితుల మధ్య షూటింగ్ స్టార్ట్ చేశాడు నాగార్జున. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్-4 స్టార్ట్ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలో నటించేందుకు నాగ్ ఇలా బయటకొచ్చాడు. ఈ సందర్భంగా లొకేషన్ లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. నాగ్ దగ్గరకు పీపీఈ కిట్ ధరించిన మేకప్ మ్యేన్ తప్ప ఎవ్వరూ రాలేదు. అసిస్టెంట్ డైరక్టర్లు కూడా 6 అడుగుల దూరం నుంచే సీన్ వివరించారు.

అలా పూర్తి జాగ్రత్తల మధ్య సెట్స్ పైకొచ్చిన నాగ్, కేవలం ఒక్క రోజులో ఈ ప్రోమో షూట్ కంప్లీట్ చేశాడు. అయితే ఇప్పట్లో సినిమా షూట్ స్టార్ట్ చేసే అవకాశం మాత్రం లేదు.