సూర్య బాటలో విశాల్

హీరో సూర్య తన సినిమాను అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేశాడు. ఆకాశం నీ హద్దురా అనే సినిమా నేరుగా అందులోనే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి డేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సూర్య బాటలో విశాల్ కూడా నడుస్తున్నాడు.

విశాల్ హీరోగా నటించిన సినిమా చక్ర. ఈ సినిమాను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో విశాల్ ఫిలింఫ్యాక్టరీ ఒప్పందం కుదుర్చుకుంది. రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తారు.

నిజానికి సూర్య సినిమా కంటే ముందే విశాల్ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో ఈ హీరో తన చక్ర సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశాడు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాలు నిజమయ్యాయి. చక్ర సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.