ఇంద్రగంటి మనసులో వెబ్ సిరీస్

దర్శకులంతా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్న వేళ.. డైరక్టర్ ఇంద్రగంటి కూడా దానిపై స్పందించాడు. ఇప్పటికిప్పుడు తనకు వెబ్ సిరీస్ చేసే ఆలోచన లేకపోయినా.. ఓ పుస్తకం ఆధారంగా వెబ్ సిరీస్ చేయాలనే కోరికను బయటపెట్టాడు. ఇంతకీ ఆ పుస్తకం ఏంటో తెలుసా?

“వెబ్ సిరీస్‌ల‌ను ఓ య‌జ్ఞంలా చేయాలి. ఓ 10 ఎపిసోడ్స్ చేయాలి. ఇప్పుడు మూడు నాలుగు క‌మిట్‌మెంట్స్ ఉండ‌టంతో అంత స‌మ‌యం కేటాయించ‌లేను. అయితే సప్త‌భూమి అనే బుక్‌ను వెబ్ సిరీస్‌గా చేస్తే బావుంటుంద‌నే ఆలోచ‌నైతే వ‌చ్చింది. మ‌రి వెబ్ సిరీస్ చేయ‌లా? సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నాను.”

ఇలా వెబ్ సిరీస్ పై తన ఆలోచనల్ని బయటపెట్టాడు ఇంద్రగంటి. అయితే ఇప్పటికిప్పుడు ఓటీటీ వైపు చూసే ఆలోచన కూడా లేదని స్పష్టంచేశాడు. ఎందుకంటే.. త్వరలోనే ఓ కామెడీ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నాడు ఇంద్రగంటి. ఆ వెంటనే దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఇంకో సినిమా లైన్లో ఉంది.

ఇలా తన చేతిలో ఉన్న 3-4 కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తానంటున్నాడు ఈ డైరక్టర్.