ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ఏపీ హైకోర్టు ఆదేశాలు – ఇండియన్‌ జర్నలిస్ట్ యూనియన్

అమరావతి భూకుంభకోణం విషయంలో 12 మంది పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఏ మీడియా సంస్థ గానీ, సోషల్ మీడియాలో గానీ ప్రచురించడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్- ఐజేయూ ఖండించింది.

సమాచారాన్ని తెలుసుకోవద్దు అనడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు విరుద్ధమని ఐజేయూ వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఆదేశం పత్రికా స్వేచ్చను హరించడమే అవుతుందని యూనియన్ అభ్యంతరం తెలిపింది. ఇలాంటి చర్యలు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తాయని ఐజేయూ ఆందోళన వ్యక్తం చేసింది.