నా కేసులో మీడియాను నియంత్రించండి – హైకోర్టులో రకుల్‌ పిటిషన్‌

సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ వ్యవహారంలో రకుల్‌ పేరు కూడా ఉందని మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో… ఆమె మీడియా నుంచి రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని పిటిషన్‌లో వివరించారు. తనను మీడియా వేధిస్తోందని చెప్పారు.

మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా చేస్తున్న ప్రచారం తన హక్కులను హరిస్తోందని ఆమె పిటిషన్‌లో వ్యాఖ్యానించారు. కాబట్టి మీడియాను నియంత్రించేలా కేంద్ర సమాచార ప్రసారాల శాఖను ఆదేశించాలని కోరారు.

చూడాలి ఢిల్లీ హైకోర్టు కూడా మీడియాను నియంత్రించేలా ఆదేశాలు ఇస్తుందో లేదో!.