ప్రదీప్ ఇక ఆగలేకపోయాడు

స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. సినిమాల్లోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్, తొలిసారిగా హీరోగా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. కానీ అతడి దురదృష్టంకొద్దీ లాక్ డౌన్ పడింది. ఫలితంగా థియేటర్లు మూతపడ్డాయి.

అయినప్పటికీ ప్రదీప్ వెయిట్ చేశాడు. నిర్మాతల్ని బుజ్జగించగలిగాడు. థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు ఆగుదామని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నెలలు గడుస్తున్నా థియేటర్ల రీ-ఓపెనింగ్ పై క్లారిటీ రాలేదు. దీంతో ప్రదీప్ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో ఒప్పందం చేసుకున్నారు.

దీపావళి సీజన్ లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. త్వరలోనే తేదీని ప్రకటించబోతోంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. ప్రదీప్ మొదటి సినిమా శాటిలైట్ రైట్స్ ను ఏ ఛానెల్ దక్కించుకుంటుందో చూడాలి.