గుండుపై క్లారిటీ ఇచ్చిన చిరు

చిరంజీవిని గుండులో చూసి చాలామంది షాక్ అయ్యారు. ఉన్నఫలంగా ఎందుకిలా గుండు కొట్టించుకున్నారని కొందరు చర్చించుకున్నారు. ఆచార్య సినిమా కోసమే ఈ కొత్త అవతారం అని మరికొందన్నారు. తన గుండు మిస్టరీపై ఒక్కొక్కటిగా సస్పెన్స్ చిక్కుముడులు విప్పుతూ వస్తున్నారు చిరంజీవి.

ముందుగా తనది గుండు కాదని ఆమధ్య స్పష్టంచేశారు చిరంజీవి. అది కేవలం మేకప్ మాత్రమేనని తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. ఆచార్య సినిమా కోసం ఆ మేకప్ వేసుకోలేదని తాజాగా స్పష్టంచేశారు. అసలు గుండు గెటప్ లోకి ఎందుకు మారాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించారు.

త్వరలోనే వేదాళం రీమేక్ లో నటించబోతున్నారు చిరంజీవి. ఆ సినిమా సెకెండాఫ్ లో చిరంజీవి గుండులో కనిపించాలి. దాని కోసమే ఇలా గుండు లుక్ ను ట్రై చేశారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

చిరంజీవి స్టేట్ మెంట్ తో రెండు విషయాలు కన్ ఫర్మ్ అయ్యాయి. ఒకటి ఆయన వేదాళంలో గుండుతో కనిపించబోతున్నారనేది కాగా.. రెండోది, ఆచార్య తర్వాత ఆయన చేసేది వేదాళం రీమేక్ అనే విషయం స్పష్టమైంది. సో.. లూసిఫర్ ప్రాజెక్ట్ ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది.