విజయ్ దేవరకొండ-రష్మిక కలిశారు….

వీళ్లిద్దరూ కలిసి గీతగోవిందం సినిమాతో ఫస్ట్ టైమ్ కలిశారు. ఆ తర్వాత కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. వీటిలో గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్టవ్వగా.. డియర్ కామ్రేడ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే తమ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వీళ్లిద్దరూ కలిసిపోయారు. రెగ్యులర్ గా ఒకరితో ఒకరు టచ్ లో ఉంటున్నారు.

నిన్ననే తన తల్లి పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు విజయ్ దేవరకొండ. 50వ పుట్టినరోజు సందర్భంగా చుట్టాళ్లందర్నీ ఆహ్వానించాడు. ఇంట్లోనే చక్కగా పండగ చేసుకున్నారు. అయితే పూర్తిగా కుటుంబపరమైన ఈ వేడుకకు రష్మిక హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అవును.. తన తల్లి పుట్టినరోజు వేడుకలకు రష్మికను ఆహ్వానించాడు విజయ్ దేవరకొండ. కేవలం ఈ ఫంక్షన్ కోసమే మంగుళూరులో ఇంట్లో కూర్చున్న రష్మిక.. ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చింది. ఈ పుట్టినరోజు వేడుకతో విజయ్-రష్మిక మధ్య బంధం ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసొచ్చింది.