పుకార్లకు చెక్ పెట్టిన శ్రద్ధా శ్రీనాధ్

జెర్సీ కాంబినేషన్ మరోసారి కలవబోతోందట. నాని-శ్రద్ధాశ్రీనాధ్ కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఆ సినిమా ప్రకటన రానుందట. ఇలా శ్రద్ధా శ్రీనాధ్ పై ఒక్కసారిగా పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఇక్కడ పుకార్లు వస్తున్న సంగతి, బెంగళూరులో ఉన్న శ్రద్ధా శ్రీనాధ్ కు తెలియలేదు. రీసెంట్ గా హైదరాబాద్ రావడంతో ఆమెకు ఈ విషయాలన్నీ తెలిశాయి.

తనపై వచ్చిన పుకార్లన్నింటిపై స్పందించింది శ్రద్ధా శ్రీనాధ్. నాని సరసన మరో సినిమా చేస్తున్నాననే వార్తలో నిజం లేదని స్పష్టంచేసింది. అంతేకాదు.. ప్రస్తుతం టాలీవుడ్ కు సంబంధించి తను ఏ సినిమాకు సైన్ చేయలేదనే విషయాన్ని కూడా బయటపెట్టింది.

రీసెంట్ గా ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ అనే సినిమా చేసింది శ్రద్ధాశ్రీనాధ్. ఆ మూవీ డైరక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంది. అందులో శ్రద్ధా కాస్త హాట్ గా కనిపించి అందర్నీ మెప్పించింది. అయితే ఆ మూవీ తర్వాత ఆమెకు మళ్లీ తెలుగులో అవకాశాలు రాకపోవడం విచిత్రం.