భర్తను కనికరించిన పూనమ్ పాండే

పూనమ్ పాండే, ఆమె భర్త శామ్ బాంబే వ్యవహారం డైలీ సీరియల్ ను తలపిస్తోంది. గుంభనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. 10 రోజులకే విడిపోయింది. ఏకంగా భర్తపై పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది పూనమ్. హనీమూన్ లో తనను చిత్రహింసలు పెట్టాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శామ్ ను జైల్లో పెట్టారు.

అలా ఈ కొత్త జంట పెళ్లి పెటాకులైంది. అయితే ఇప్పుడే ఇందులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బెయిల్ పై విడుదలైన శామ్, ఇప్పుడు మళ్లీ పూనమ్ వద్దకు చేరుకున్నాడు. తనను క్షమించమని పూనమ్ కాళ్లు పట్టుకున్నాడు. భర్త వేడుకోవడంతో తన కేసును వాపస్ తీసుకుంటున్నట్టు పూనమ్ ప్రకటించింది.

అయితే కేసు వెనక్కి తీసుకున్నంత మాత్రాన వీళ్లిద్దరూ కలిసిపోయినట్టు కాదు. తనతో జీవితం కొనసాగించాలా లేక పూర్తిస్థాయిలో విడిపోవాలా అనే నిర్ణయాన్ని మరికొన్ని రోజుల్లో తీసుకుంటానని తెలిపింది.