తారక్ టీజర్ పై రాజమౌళి రియాక్షన్

లెక్కప్రకారం ఈపాటికి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ టీజర్ వచ్చేయాలి. కానీ ఆఖరి నిమిషంలో లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఈసారి ఆ టీజర్ కు సంబంధించిన సన్నివేశాలతోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు రాజమౌళి. కానీ టీజర్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పడానికి ఇష్టపడడం లేదు.

“కరోనా ముందు నేను డేట్ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్పలేను. షూటింగ్ కు కొన్ని ప్రొటోకాల్స్ ఉన్నాయి. వీటి ప్రకారం అనుకున్న టైమ్ లోనే షూట్ చేయగలనా, ఇంకా టైమ్ పడుతుందా, వచ్చే ఇబ్బందులేంటి అనేది నేను సెట్స్ పైకి వెళ్తే తప్ప చెప్పలేను. ప్రస్తుతానికైతే 2 నెలల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. రేపోమాపో సెట్స్ పైకి వస్తాం. పరిస్థితులన్నీ చూసుకొని, అన్నీ అనుకున్నట్టు జరిగితే అప్పుడు డేట్ చెబుతాను.”

అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపట్నుంచే ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా షెడ్యూల్ ఉంటుంది. తను అనుకున్న ప్రకారం షూటింగ్ నడిస్తే, షెడ్యూల్ ఉంటుందని.. లేదంటే మరికొన్నాళ్లు వెయిట్ చేస్తామని రాజమౌళి ప్రకటించాడు.